జపాన్ దేశాన్ని సముద్రంలో కలిపేస్తాం: నార్త్ కొరియా

SMTV Desk 2017-09-14 16:01:34  North Korea, Japan, Hydrogen Bomb, UNO, USA

ఉత్తర కొరియా, సెప్టెంబర్ 14: గతకొంత కాలంగా సమాజ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియా తాజాగా మరో సంచలనాత్మక హెచ్చరికలు జారీ చేసింది. త్వరలో జపాన్ దేశాన్ని తమ అణుబాంబులతో సముద్రంలోన కలిపేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. "ఇక మా దేశానికి సమీపంలో ఉండే అర్హత జపాన్ కు ఎంతమాత్రమూ లేదు" అని ప్రభుత్వ రంగానికి చెందిన కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ గురువారం ప్రచురించింది. నాలుగు ద్వీపాలు కలిగిన జపాన్‌‌ను ఒక అణుబాంబు వేయడం ద్వారా చిత్తు చేస్తామని, తమను తాము కాపాడుకునేందుకు ఇదో మార్గమని వెల్లడించింది. దీనిపై జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ యోషిహైడ్ సుగా స్పందిస్తూ, కొరియా రెచ్చగొట్టే ధోరణిలో ఉందని తేల్చి చెప్పడం గమనార్హం. కొరియా ఈ విధానం మార్చుకోకపోతే ప్రపంచంలోనే ఏకాకిగా మిగిలిపోతుందంటూ మండిపడ్డారు. ఈ నెల మొదట్లో కొరియా జపాన్ మీదుగా ఒక ఖండాంతర క్షిపణి ప్రయోగంచేయగా, ఐక్యరాజ్యసమితి ఆ దేశంపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఆ దేశం నుండి ఎలాంటి దిగుమతులు చేసుకోరాదని ఐరాస భద్రతామండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఉత్తర కొరియా తాజా హెచ్చరికల నేపధ్యంలో ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.