అమెరికా జీడీపీ వృద్ధి రేటుపై తుఫాన్ల ప్రభావం: రాయిటర్ సంస్థ

SMTV Desk 2017-09-14 14:51:32  Harricane Irma, Hurricane Harvey, USA, victims in Florida

ఫ్లోరిడా, సెప్టెంబర్ 14: అగ్రరాజ్యం అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ హ‌రికేన్ హార్వీ, హరికేన్ ఇర్మాల ప్ర‌భావం అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఏ మేరకు ఉండబోతుందని రాయిటర్స్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. అయితే ఈ పోల్‌లో పాల్గొన్న వివిధ యూనివర్సిటీల‌కు చెందిన పలువురు ఆర్థిక శాస్త్ర‌వేత్త‌లు మిశ్ర‌మ అభిప్రాయాలను వెల్లడించారు. ఇర్మా ప్ర‌భావం 0.3 శాతం మాత్ర‌మే ఉంటుందని కొందరు తెలపగా, బర్కీ యూనివ‌ర్సిటీ ఆర్థిక శాస్త్ర‌వేత్త‌లు మాత్రం అత్యధికంగా 1.0 నుంచి 1.5 శాతం ఉంటుందన్నారు. అయితే రాయిటర్స్ సంస్థ నిర్వహించిన ఈ పోల్ హ‌రికేన్ ఇర్మా రావ‌డానికి ముందు జరిగింది. కాగా, ఇదివరకే వచ్చిన హ‌రికేన్ క‌త్రినా, హ‌రికేన్ శాండీ తుఫాన్ లు జీడీపీ వృద్ధిరేటుపై తీవ్ర స్థాయి ప్రభావం చూపించాయి. ఈ నేపధ్యంలో గ‌త యాభై ఏళ్ల‌లో చూడ‌ని విధంగా సంభ‌వించిన హ‌రికేన్ హార్వీ, ఇర్మాల ప్ర‌భావం జీడీపీ వృద్ధిరేటుపై గతం కంటే అధికంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఏ మేరకు ప్రభావం పడిందో తెలియాలంటే వేచి చూడాలి మరి.