జేఎన్టీయూ లో కుప్పకూలిన భవనం

SMTV Desk 2017-09-14 13:43:57  Hyderabad, JNTUH, KPHB, rain, building collapse

హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్ లో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు భవనాలు కుప్పకూలుతున్నాయి. కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న జేఎన్టీయూలోని మెకానికల్ విభాగానికి చెందిన పోర్టికో అనే పేరు ఉన్న ఒక బిల్డింగ్ కూలిపోయింది. అయితే ఆ సమయంలో భవనంలో విద్యార్ధులు ఎవరు లేకపోవడ౦తో ఎలాంటి ప్రాణ హాని సంభవించలేదు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... నిన్న రాత్రి నుంచి ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భవనం కులిపోయిందనే ప్రాధమిక సమాచారాన్ని అందించారు.