తొలి బుల్లెట్ రైలు మార్గానికి మోడీ, షింజో ల శంకుస్థాపన

SMTV Desk 2017-09-14 11:46:37  ahmedabad, prime minister of india, prime minister of japan, bullet train project in india,

అహ్మదాబాద్, సెప్టెంబర్ 14: భారత్ లో తొలి బుల్లెట్ రైలు మార్గానికి అహ్మదాబాద్ లోని సబర్మతిలో భారత్, జపాన్ ల ప్రధానులు నరేంద్ర మోదీ, షింజో అబేలు నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..."ఈ బుల్లెట్ రైలు గంటకు 350 కిలో మీటర్ల వేగంతో 508 కిలో మీటర్ల మేర ప్రయాణి౦చను౦దని చెప్పారు. లక్షా పదివేల కోట్ల వ్యయంతో 27 కి.మీ. భూగర్భ టన్నెల్, సముద్ర గర్భ౦లో 7 కి.మీ. మేర నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రధాని వెల్లడించారు. కాగా, దీనికి గాను భారత్ కు జపాన్ ప్రభుత్వం 80 వేల కోట్లు ఋణం మంజూరు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ 2022 నాటికి పూర్తి చేయాలనేదే తమ సంకల్పమని తెలిపిన ఆయన ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత బుల్లెట్ ట్రైన్ ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య రోజుకి 35 ట్రిప్పులు తిరగనున్నట్లు" తెలిపారు.