గూగుల్ మ్యాప్స్‌ ఐడియా అదుర్స్..

SMTV Desk 2017-09-14 11:24:18  google maps, question and answers system, new version updated.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14 : సాంకేతిక రంగం అర చేతుల్లోకి వచ్చాక తన అవసరాలను తీర్చుకోవడానికి మొబైల్ ఫోన్ పై ఎక్కువగా ఆధారపడుతున్నాడు. గతంలో మనం గమ్యస్థానాలకు చేరుకోవడానికి, కావాల్సిన చిరునామా గురించి తెలుసుకోవడానికి బయటి వ్యక్తులపై ఆధారపడే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. ఇంకా స్మార్ట్ ఫోన్లో మనం చేరుకోవాల్సిన ప్రదేశానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతలా గూగుల్ మ్యాప్స్‌ ప్రాచుర్యం పొందింది. అయితే మనం ఒక ప్రాంతం గురించి గూగుల్‌ లో వెతికినప్పుడు కొన్నిసార్లు సమాచారం అసంపూర్తిగా, అర్ధం కాకుండా కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు మనకు ఓ సందేహం అలాగే ఉండిపోతుంది. దీనికోసమే గూగుల్ మ్యాప్స్‌ ఒక కొత్త పరిష్కార మార్గాన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే.. ఒక ప్రశ్న వేయగానే దానికి తగిన జవాబు వచ్చే విధంగా ఒక కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా మీకు వచ్చిన సందేహాన్ని ఒక ప్రశ్న రూపంలో అందిస్తే, గూగుల్ కమ్యూనిటీ నుంచి ఒక సమాధానం వస్తుంది. ఉదాహరణకు గూగుల్ మ్యాప్స్ లో రామోజీ ఫిలింసిటీ గురించి వెతకగానే ఈ ప్రాంతానికి చేరుకోవల్సిన రోడ్ మ్యాప్ చూపిస్తుంది. కాని ఆ వివరాలలో ఎంట్రీ ఫీజు లాంటి వివరాలేమీ కనిపించవు. అప్పుడు ఆ ప్రశ్నను అక్కడి బాక్స్ లో రాస్తే వెంటనే సమాధానం వస్తుంది. ఎలా ఉంది ఈ ఐడియా అదిరింది కదూ..!