నేను ఈ పాట రాయలేదు : కంగనా

SMTV Desk 2017-09-13 20:09:13  kangana, latest video, samantha, samantha twitter post

హైదరాబాద్ సెప్టెంబర్ 13: తాజాగా కంగనా బాలీవుడ్ ప్రముఖుల పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే!. అయితే ఈ మద్య కంగనా ఓ మ్యూజిక్ వీడియో ని విడుదల చేసింది. ఆ వీడియో లో బాలీవుడ్ సినిమాల తీరును వివరిస్తూ వ్యంగ రూపకంగా విడుదల చేసింది. అందులో కంగన రనౌత్ బాలీవుడ్ తీరును విమర్శించడం చెన్నై బ్యూటీ సమంతకు బాగా నచ్చేసినట్లుంది. కంగనా రనౌత్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంటూ ఆ వీడియోను షేర్ చేసింది. ఆమె ఓ లెజెండరీ అని సమంత పేర్కొంది. ధైర్యానికే ఓ ముఖం ఉంటే అది కంగ‌నా ర‌నౌతేన‌ని ట్వీట్ చేసింది. ఈ పాట చివర్లో నేను ఈ పాట రాయలేదు, నేను రాయలేదు అంటూ ముగించింది కంగనా ఈ వీడియో.