కంగుతిన్న చాంఫియన్లు

SMTV Desk 2017-06-05 15:45:55  franch open, kristina, kerbare, vinus willioms, sania mirza

పారిస్, జూన్ 5 : ఫ్రెంచ్ ఓపెన్ లో డిఫెండింగ్ చాంఫియన్ లు కంగుతింటున్నారు. మహిళల సింగిల్స్ లో నంబర్ వన్ కెర్బర్ మ్యాచ్ ఆరంభ రౌండ్ లోనే వెనుతిరగగా, తాజాగా డిఫెండింగ్ చాంపియన్ ము గురుజా ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. లోకల్ ఫేవరేట్ క్రిస్టీనా మ్లాదెనోవిచ్ 6-1, 3-6, 6-3 తో స్పెయిన్ స్టార్ ముగురుజాకి షాకిచ్చి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది.మ్యాచ్ ప్రారంభం నుంచే ముగురుజాపై పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంటూ వచ్చిన క్రిస్టీనా ఒక్కసారిగా విజృంభించింది. ఈ వేదికపై చివరిసారిగా 2000లో మేరీ పియర్స్ ఆతిథ్య దేశం తరపున టైటిల్ సాధించింది. మరి అనూహ్యంగా డిఫెండింగ్ చాంపియన్ ను కంగుతినిపించి ఫేవరేట్ గా నిలిచిన క్రిస్టీనా ఈ టైటిల్ కోసం 14 ఏళ్ల ఫ్రెంచ్ వాసుల కలను నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి. ఇటీవల వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న, ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ వీనస్ విలియమ్స్ కు నాలుగో రౌండ్లోనే చుక్కెదురైంది.స్విట్జర్లాండ్ కు చెందిన తిమియా బాసిన్ స్కీ 5-7, 6-2, 6-1 తో 2002 విజేత వీనస్ ను బోల్తా కొట్టించి క్రిస్టీనా తో క్వార్టర్స్ పోరుకు సిద్ధమైంది. ఎన్నాళ్లుగానో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న మాజీ నంబర్ వన్ కరోలినా వోజ్నియాకి, మాజీ చాంపియన్ కుజ్నెత్సోవా ను ఓడించి క్వార్టర్స్ చేరింది. మిగతా సీడెడ్ క్రీడాకారిణుల్లో ప్లి స్కోవా, కారినా వితోఫ్ట్ పై విజయం సాధించగా, స్వతోలినా పై మాగ్ధా లినెట్ గెలిచి ప్రీ క్వార్టర్స్ చేరారు. ఇక భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫ్రెంచ్ ఓపెన్ లో డబుల్స్ నుంచి నిష్ర్కమించినా, మిక్స్ డ్ లో మాత్రం అదరగొడుతు దూసుకెళ్తున్నది. మిక్స్ డ్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరింది.