జగన్ నియోజకవర్గ౦పై లోకేష్ టార్గెట్..!

SMTV Desk 2017-09-13 19:07:23  Nara lokesh, 10 crores funds, ys jagan, tdp party,

అమరావతి, సెప్టెంబర్ 13 : వైకాపా అధినేత జగన్ నియోజకవర్గంపై టీడీపీ కన్నేసిందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. సొంత పార్టీ నేతలే నియోజకవర్గ అభివృద్ధికై నిధులు కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ప్రాధేయ పడుతున్నా కనికరించకుండా, అడగకుండానే జగన్ నియోజకవర్గానికి పది కోట్లు మంజూరు చేయడం చూస్తుంటే టీడీపీ వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే జగన్ నియోజక వర్గానికి పదికోట్ల నిధులు మంజూరు చేసినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా జగన్ ఇలాకాపై లోకేష్ టార్గెట్ చేశారని అందులో భాగంగానే ఈ నిధులను ప్రభుత్వంచే మంజూరు చేయించినట్లు తెలుస్తోంది.