అది పూర్తి చేయకపోతే సిమ్‌ కార్డు లు పనిచేయవట

SMTV Desk 2017-09-13 15:07:27  Supreme Court, Aadhaar, mobile link

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: లోక్‌ నీతి పౌండేషన్‌ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ ను అనుసంధానించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మొబైల్‌ సిమ్‌ కార్డుల విషయంలో కేంద్రం కీలకమైన ప్రకటన చేసింది. తప్పుడు చిరునామాలతో నకిలి సిమ్‌కార్డులు తీసుకుని ఉపయోగిస్తున్న నేరస్థులు, మోసగాళ్లు, ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయవచ్చునని అధికారులు భావిస్తున్నా రు. ఈ నేపథ్యంలో సిమ్‌కార్డు విక్రయ సమయంలో వినియోగ దారుడి బయోమెట్రిక్‌ తీసుకొని దాన్ని ఆధార్‌తో సరిపోల్చి నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుంది. కాగా 2018 ఫిబ్రవరి నాటికి అనుసంధాన ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. గడువులోగా అనుసంధానం పూర్తి చేయకుంటే సిమ్‌ లు పనిచేయవని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు సిమ్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని కోరుతూ వినియోగదారులకు సందేశాలు పంపుతున్నాయి.