సిస్కో భాగస్వామ్యంతో డిజిటల్ తెలంగాణా..

SMTV Desk 2017-05-27 13:02:38  america,digital,ktr,it,telangana,siscodigital,

ఆమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం సిస్కో డిజిటల్ తెలంగాణా ఆవిష్కరణలో భాగస్వామ్యం వహించనుంది.అందులో భాగంగా సిస్కో చైర్మన్ తమ ఆసక్తిని ఆమెరికా పర్యటనలో ఉన్న ఐటిశాఖామాత్యులు కేటిఆర్ కు వివరించారు.డిజిటల్ ఇండియా,డిజిటల్ తెలంగాణా ప్రాజెక్టుల విషయంలో తమ ఆలోచనలను వివరించారు.టేక్నాలజీ డెమాన్షస్ట్రేషన్ ప్రాజెక్టులో తాము భాగస్వామ్యం వహిస్తామని ఆ సంస్థ చైర్మన్ జాన్ చాంబర్స్ మంత్రి కేటిఆర్ కు హామి ఇచ్చారు.ఆమెరికా పర్యటనలో ఉన్న కేటిఆర్ సిలికాన్ వ్యాలీలో ఉన్న సిస్కో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా చైర్మన్ జాన్ చాంబర్స్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకోని కేటిఆర్ కు సాదార స్వాగతం పలికారు.