శ్రద్ధా కోసం తెలుగు మాస్టారా?

SMTV Desk 2017-09-13 08:17:16  shraddha, prabhas, saaho, sujith, baaahubali star

హైదరాబాద్ సెప్టెంబర్ 13 : బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అయిన రోజు నుండి వినిపిస్తున్న ప్రభాస్ తరువాతి చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి ముందుగా అనుష్క శెట్టి హీరోయిన్ గా అనుకున్నారు కానీ చివరి నిముషంలో శ్రద్ధ కపూర్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా తెలుగు, హిందీ బాషాలలో ఏకకాలంలో రూపొందుతుంది, చాల వేగంగా చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. మంగళవారం రోజున ఆమె సెట్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ల పై ఓ ఫ్యాక్టరీ నేపథ్యంలో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో శ్రద్దా కపూర్‌ నటిస్తున్న తొలి చిత్రం ఇది. వారం రోజుల నుంచీ హైదరాబాద్‌లోనే ఉంటోంది శ్రద్ధ, ఆ వారం రోజులు స్క్రిప్టుని దగ్గర పెట్టుకొని సంభాషణలు ఎలా పలకాలో నేర్చుకొంటోందట. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ తెలుగు మాస్టారుని నియమించుకొందట.. హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాల కోసమే రూ.20 కోట్లపై చిలుకు బడ్జెట్‌ కేటాయించారట. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు.