టీమిండియాకు అతినీచమైన వరల్డ్ కప్ అదే: సచిన్

SMTV Desk 2017-09-12 18:42:44  Cricket, World Cup, Sachin Tendulkar, Team India

ముంబై, సెప్టెంబర్ 12: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 2007 వరల్డ్ కప్ గురించి ప్రస్తావిస్తూ... ప్రపంచ కప్ చరిత్రలోనే భారత్‌కి అతినీచమైన సమయం 2007 అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఏదో ఆడుకుంటూ వెళ్లామ‌ని, సరైన మార్గదర్శకత్వంలో ఆడుతున్నట్లు కనిపించలేదని సచిన్ వాపోయిన మాస్టర్ సచిన్ భారత్ సూపర్-8కి కూడా రాలేకపోయిందన్నారు. కాగా, ఆ ప్ర‌పంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్ లను కూడా ఓడిపోయామ‌ని గుర్తు చేశారు. అనంతరం జట్టులో చాలా మార్పు అవసరమయ్యాయని తెలిపారు. అయితే సచిన్ తన క్రికెట్ కెరీర్ లో మర్చిపోలేని మ్యాచ్ 2011 వరల్డ్ కప్ అని స్పష్టం చేశారు.