అది సావిత్రి సినిమాకి సంబంధించింది కాదు : కీర్తి సురేష్

SMTV Desk 2017-09-12 16:04:34  MAHANATI MOVIE, KEERTHI SURESH, PHOTOS VIRAL, DIRECTER NAG ASHWIN, PRODUCER PRIYANKA DUTT

హైదరాబాద్, సెప్టెంబర్ 12 : సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న "మహానటి" చిత్రంలో కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంపై సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవలే సావిత్రి "మహానటి" సినిమాలో ఈ విధంగా కనిపించబోతోంది అంటూ కొన్ని కీర్తి సురేష్ ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై కీర్తి, ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఈ ఫోటోలు సావిత్రి సినిమా కోసం దిగినవి కాదు, ఓ షాపింగ్ మాల్ కార్యక్రమం కోసం దిగినవని క్లారిటీ ఇచ్చింది. ఇంకా "మహానటి" చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి చాలా సమయం పడుతుందని స్పష్టత ఇచ్చారు. కాగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రియాంక దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, ప్రగ్యా జైశ్వాల్‌ కూడా నటిస్తున్నట్లుగా సమాచారం.