పరువు కోసం సోదరి ప్రియుడిని చంపాడు..

SMTV Desk 2017-09-12 12:03:56  hyderabad, mangalhat, sitharambag, murder attempted on amar

హైదరాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్ మంగళహాట్ పరిధిలో ఓ హత్య కలకలం రేపుతోంది. పోలిసుల కథనం ప్రకారం.... "ఇందిరానగర్ లో ఉంటున్న మహారాష్ట్ర కు చెందిన అమర్, మల్లేపల్లె లో ఓ హోటల్ లో పనిచేస్తు౦డేవాడు. అదే కాలనీ కి చెందిన కవిత తో ప్రేమలో పడ్డాడు. ప్రేమతోనే ఆగకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి బెంగుళూర్ కి పారిపోయిన అమర్, కవిత లను,రాజి కుదుర్చుకుందామని కవిత అన్నయ్య అయిన లక్ష్మణ్ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని సితారామ్ బాగ్ కి తీసుకొచ్చి అమర్ ను దారుణ౦గా హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. నిందితుడు లక్ష్మణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.