ట్రంప్ ప్రతిజ్ఞ దేని గురించి అంటే..

SMTV Desk 2017-09-12 11:24:40  Al Qaeda Terrorists, American President Donald Trumps pledge,

వాషింగ్టన్, సెప్టెంబర్ 12 : ప్రపంచ దేశాలపై ఉగ్రవాదులు చేసే దాడులను అరికట్టేందుకు ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించి తీరుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. అల్ ఖైదా ఉగ్రవాదులు యూఎస్ పై దాడి చేసి 16 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ విషాద సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. గత నెలలో ఉగ్రవాదులకు స్వర్గధామంగా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్ పై కఠిన వ్యాఖ్యలు చేసిన ఆయన, తమ ఓపికను బలహీనపరచాలని ఉగ్రవాదులు అనుకుంటే మాత్రం చాలా తప్పని ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు దేశంపై ఉగ్రవాదులు దాడి జరిపితే, అమెరికా చేతిలో ఓటమి పాలై శత్రువుల జాబితాలో చేరినట్టేనని, వారు ఎక్కడ దాక్కున్నా, వేటాడటం ఆగదని తెలిపారు.