వాట్సప్ లో హనీప్రీత్ ఫోన్ నంబర్..!!

SMTV Desk 2017-09-12 11:15:28  GURMITH SINGH BABA, HONEY PREETH INSAAN, PHONE NUMBER VIRAL IN WHATS APP.

చండీఘర్, సెప్టెంబర్ 12 : వివాదాస్పద బాబా గుర్మీత్ సింగ్ కు జైలు శిక్ష విధించిన తర్వాత పరారైన అతని అనుచరురాలు హనీప్రీత్ ఇన్సాన్ ఫోన్ నంబర్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ లో వైరల్ గా మారింది. అయితే ఇటీవలే గుర్మీత్ బాబా సహా హనీప్రీత్ కు ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అసోసియేషన్ సభ్యత్వాన్ని రద్దు చేసి౦ది. వీరికి ఉన్న సభ్యత్వ కార్డ్ ను ప్రముఖ మీడియా సంపాదించి, దానిని మీడియా ముందు ప్రవేశపెట్టడంతో అందులోని హనీప్రీత్ ఫోన్ నంబర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ఆ నంబర్ స్విచ్ ఆఫ్ లో ఉండడం విశేషం. గత ఆగస్ట్ లో ఈ నంబర్ పై గుర్మీత్ రాం రహీమ్ బాబాకు జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆగస్ట్ 20 న జరిగిన రైలు ప్రమాద సందేశం ఉంది. కాగా హనీప్రీత్ నేపాల్ పారిపోయిందని పోలీసులు భావిస్తూ ఆ దేశ సరిహద్దుల్లో ఆమె ఫోటోలను అతికించి ఆమెను వెతికే ప్రయత్నం చేస్తున్న విషయం విదితమే.