రానున్న ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు: మంత్రి నారాయణ

SMTV Desk 2017-09-12 10:50:38  Minister Narayana, Housing scheme, Janardhan Reddy colony of Nellore city, Housing for all

నెల్లూరు, సెప్టెంబర్ 12 అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా నెల్లూరు జనార్ధన్ రెడ్డి కాలనీ లో బహుళ అంతస్తు భవనాల నిర్మాణాలను మంత్రి నారాయణ పరిశీలించారు. రాష్ట్రంలో పట్టణ పేదలకు ఇళ్ళ నిర్మాణ పథకం వేగంగా సాగుతోందని చెప్పారు. ఒంగోలు, కావలి ప్రాంతాల్లోనే స్థలం సమస్యతో నిర్మాణం ప్రారంభం కాలేదని అన్ని చోట్ల పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. జనార్ధన్ రెడ్డి కాలనీలో నిర్మాణాలపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి నిర్మాణ సంస్థను అభినందించారు. 40 రోజుల్లో పునాదుల నిర్మాణం ఒక దశకు తీసుకువచ్చారని దాదాపు నవంబర్ నాటికి 20 శాతం ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగిస్తామని తెలిపారు. 2022 నాటికి అర్బన్ ప్రాంతాల్లో ప్రతి ఒక్క పేద కుటుంబానికి సొంత ఇంట్లో నివాసం ఉండాలనేదే ముఖ్యమంత్రి ఆశయమని ఆయన వెల్లడించారు.