మరో విద్యార్ధిని దారుణ హత్య...

SMTV Desk 2017-09-12 10:49:57  hyderabad, madinaguda, ameenpur, murder attempted on student

హైదరాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్ మదీనాగూడ లో విద్యార్ధిని దారుణ హత్య చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కాలేజీ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చాందిని జైన్, ఈ నెల 9 న సాయంత్రం స్నేహితులను కలిసేందుకు బయటకు వెళ్తున్నా అని చెప్పింది, ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన, తల్లి తండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల నుండి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ తన ఆచూకి దొరకలేదు. ఈ రోజు ఉదయం అమీన్ పూర్ కొండల్లో విద్యార్ధిని చాందిని జైన్ మృతుదేహం లభించడం తో తల్లిదండ్రులు కన్నిటిపర్యంతం అయ్యారు. ఘటన స్థలాన్ని సంగారెడ్డి ఎస్పీ, మియాపూర్ ఏసీపి, పరిశీలించి, కిడ్నాప్, హత్య కేసు నమోదు చేశారు.