ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తీపి కబురు..!

SMTV Desk 2017-09-12 10:47:53  AMAZON, JOBS RECRUITMENT, FESTIVAL SEASON, 22,000 JOBS VACANCIES.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఒక తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఇరవై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు నిరుద్యోగులకు ఒక శుభవార్తను తెలిపింది. వచ్చే పండగ సీజన్ ను పురస్కరించుకొని ఇలా భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి హైదరాబాద్ తో సహా చెన్నై, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ ఇంకా దేశంలోని మిగతా నగరాల్లోని ఉద్యోగులను తీసుకోనున్నట్లు అమెజాన్ కస్టమర్ ఫుల్‌ఫిల్మెంట్ వైస్ ప్రెసిడెంట్ అకిల్ సక్సేనా వెల్లడించారు. ఈ ఉద్యోగాలను సార్టేషన్ కేంద్రాలు, ఫుల్‌ఫిల్మెంట్, డెలివరీ స్టేషన్లు, కస్టమర్ సర్వీసు సెంటర్లలో భర్తీ చేయనున్నారు.