ద్విపాత్రాభినయం చేస్తున్న విజయ్ అంటోని

SMTV Desk 2017-09-11 23:36:25  bichhagadu, vijay antoni, producer radhika, indrasena, vijay antoni next movie

హైదరాబాద్ సెప్టెంబర్ 11 : బిచ్చగాడు ఫేం విజయ్ అంటోని కథానాయకుడిగా ‘ఇంద్ర సేన ‘ సినిమా రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ సినిమా ని రాధిక నిర్మింస్తున్నారు. విజయ్ అంటోని ఈ చిత్రం లో ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో అన్నదమ్ములుగా చేస్తున్నాడు, ఓ షాప్ కి ఓనరైన తాగుబోతు పాత్రలో అన్నయ్యగా .. బాధ్యత తెలిసిన పీఈటీ మాస్టర్ గా తమ్ముడి పాత్రలో ఆయన కనిపిస్తాడని చెబుతున్నారు. సినిమా మంచి కథనం తో సాగనుందని సమాచారం. నవంబర్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.