నేను పబ్లిక్‌ ఫిగర్‌ని. పబ్లిక్‌ ప్రాపర్టీని కాదంటున్న గోవా బ్యూటీ

SMTV Desk 2017-09-11 15:39:42  mumbai, goa beauty ileana, andru nibon,

ముంబై, సెప్టెంబర్ 11: గోవా బ్యూటీ ఇలియానా నటించిన ‘బాద్‌షాహో’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే రూ.50 కోట్లు వచ్చాయి. ఈ బ్యూటీ ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య ఎక్కడికెళ్ళినా సినిమాల గురించి కాకుండా తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి అడుగుతున్నారట. దీంతో నెటిజన్లపై మండిపడి, తన ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. " నేను పబ్లిక్‌ ఫిగర్‌ని. పబ్లిక్‌ ప్రాపర్టీని కాను. నేను చేస్తున్నది తప్పు అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. నా బాయ్‌ఫ్రెండ్‌ గురించి అడగడంలో తప్పులేదు. కానీ చాలా మంది అతని జాతి గురించే అడుగుతున్నారు. అతను తెల్లగా ఉంటాడు కాబట్టే నేను డేటింగ్‌ చేస్తున్నానని అంటున్నారు. అదొక్కటే నాకు నచ్చని విషయం. మిగతా మగవారంతా తమ భార్యలు, తల్లుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తున్నారా? మరి నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనూ అమ్మాయినే కదా? మీ ఇంట్లో ఆడవారికి ఇచ్చే గౌరవం నాకెందుకు ఇవ్వరని" ట్విట్ చేస్తూ మండిపడింది ఇలియానా.