పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన భారత్

SMTV Desk 2017-06-05 12:00:22  bhaarath,pakistan,kohli,ajahar ali

ఇంగ్లాండ్, జూన్ 5 : పాకిస్తాన్, భారత్ మ్యాచ్ అంటే ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది. ఎవరు ఎన్ని గెలిచినా, ఎన్ని ఓడిన అభిమానులు ఏమి పట్టించుకోరు. అయిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అదే ఉత్సాహం తో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కు భారత్ జట్టు చుక్కలు చూపించింది. భారత్ జట్టు బ్యాటింగ్ లో బౌలింగ్ లో ఇలా అన్నింటిలో సమిష్టి గా రాణించి పాకిస్తాన్ పై భారత్ భారీ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్ లో అదుర్స్ అనిపించుకుంది. చాలాకాలం తరువాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ తన బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ( 119 బంతుల్లో 7 ఫోర్స్ లు 2 సిక్స్ లతో 91 పరుగులు) చేశాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా అంతే దాటిగా ఆడాడు. శిఖర్ ధావన్ ( 65 బంతుల్లో 6 ఫోర్స్ ఒక సిక్స్ తో 68 ) పరుగులు చేశాడు ఇద్దరు మొదటి వికెట్ కు 136 పరుగుల బాగస్వామ్యం అందించారు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లి మరో సారి పాకిస్తాన్ పైన తన ప్రతాపాన్ని చూపించాడు. కోహ్లి ( 68 బంతుల్లో 6 ఫోర్స్ 3 సిక్స్ లతో 81) పరుగులు చేసి నాటౌట్ గా నిలించాడు. రోహిత్ అవుట్ అయిన తరువాత వచ్చిన యువరాజ్ తన బ్యాటింగ్ తో ప్రత్యర్ధుల పై విరుచుకు పడ్డాడు. ( 32 బంతుల్లో 8 ఫోర్స్ ఒక సిక్స్ తో 53 ) పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్య కూడా అదే జోరు తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. (6 బంతుల్లో 3 సిక్స్ లతో 20) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇలా భారత్ బ్యాటింగ్ లో రాణించి పాకిస్తాన్ బౌలర్స్ కు చుక్కలు చూపించారు. తరువాత పాకిస్తాన్ బ్యాటింగ్ దిగింది. వర్షం కారణంగా 41 ఓవర్స్ లో 289 పరుగులకు కుదించారు. భారత్ బౌలర్స్ ముందు నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ అధ్బుతమైన ఫీల్డింగ్ తో అదరగొట్టారు. జడేజా రనౌట్ చేసి మ్యాచ్ ని మన వైపుకు తిప్పాడు. ఈ దశలో వచ్చిన పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ ఎక్కడ కుదురుకోలేక పోయారు. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ లో ఒక్క అజహర్ అలీ (50) పరుగులతో రాణించాడు. మిగిలిన వాళ్ళు తక్కువ స్కోర్ తో వెనుదిరుగడం తో భారత్ విజయం ఖాయం అయ్యింది. భారత్ బౌలింగ్, ఉమేష్ యాదవ్7.4-1-30-3 : భువనేశ్వర్5-1-23-1: జడేజా 8-0-43-2: పాండ్య 8-0-43-2 :బుమ్ర 5-0-23-0 ఇలా బౌలింగ్ లో కూడా రాణించి పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ కు భారత్ బౌలర్స్ చుక్కలు చూపించారు. ఇలా సమిష్టి గా రాణించడం తో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫి లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 2 మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. మిగిలిన 12 మ్యాచ్ లో భారత్ గెలువడం విశేషం ఇలా భారత్, పాకిస్తాన్ మధ్య ఎన్ని మ్యాచ్ లు జరిగిన ఆ క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది.