2019 ఎన్నికల్లో ‘టీడీపీ’ కి ‘బీజేపీ’ వెన్నుపోటు తప్పదా..?

SMTV Desk 2017-09-11 12:17:55  2019 elections, 2019 elections bjp support ysrcp, ysrcp bjp, tdp bjp, Andhra politics

అమరావతి సెప్టెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి బీజేపీ సపోర్ట్ గా ఉంది. ఉత్తరాణ తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న కాషాయి దళం, దక్షిణాన కూడా తన అధికారాన్ని విస్తరించాలనే ఆలోచనతో 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో జత కట్టింది. కానీ రాబోయే ఎన్నికల్లో మాత్రం బీజీపీ సొంతంగా బరిలోకి దిగి సాధ్యమైనన్ని స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుందని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం భాజపా తటస్థ వైఖరిని అవలంభించే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీనికి కారణాలు సైతం లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైకాపా పార్టీలకు సమానంగా స్థానాలు దక్కితే అప్పుడు బీజేపీ ‘డిసైడింగ్ ఫాక్టర్’ గా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. డిసైడింగ్ ఫాక్టర్ అంటే ఇక్కడ అచ్చ తెలుగు భాషలో ‘గోడ మీద పిల్లి’ గా వ్యవహరిస్తుందని అర్థం. అయితే రెండు పార్టీలకు దక్కిన స్థానాల్లో ఏ మాత్రం వైకాపా కు కొన్ని స్థానాలు ఎక్కువ దక్కినా వెంటనే బీజేపీ వైకాపా తో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అయిపోతుందని, రాజకీయాల్లో శాశ్వత శతృత్వానికి, శాశ్వత మిత్రుత్వానికి స్థానం లేని నేపథ్యంలో బీజేపీ వైకాపా కు వెన్నుపోటు పొడిచే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.