చిత్తూరు జిల్లాలో విషాదం... పిడుగుపాటుకి ఇద్దరు యువకుల మృతి

SMTV Desk 2017-09-10 19:03:55  Rainy season, Rain fall at Andhrapradesh, Weather update

చిత్తూరు, సెప్టెంబర్ 10: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం చిన్నఈటిపాతం గ్రామంలో పెను విషాదం నెలకొంది. నేడు స్థానికంగా అకాల వర్షం కురవగా, అదే సమయంలో పిడుగులు పడ్డాయి. ఈ పిడుగుపాటుతో విమల్‌రాజు(14), మహేశ్‌(14)తో పాటు మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే విమల్‌, మహేశ్‌ మృతి చెందారు. కాగా, మిగతా ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.