పదవి విరమణ చేసిన న్యాయవాది రామ్‌జెఠ్మలానీ

SMTV Desk 2017-09-10 17:49:54   Lawyer Ram Jethmalani, retirement

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 : ప్రముఖ న్యాయవాది సీనియర్‌ బీజేపీ నేత రామ్‌జెఠ్మలానీ (94) న్యాయవాదిగా పదవి కాలం ముగియడంతో శనివారం పదవి విరమణ చేశారు. సుమారు 7 దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగిన జెఠ్మలానీ పలు చారిత్రాత్మక కేసులను వాదించి మంచి గుర్తింపు పొందారు. న్యాయవాద వృత్తికి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఆయన.. ఇకపై నన్ను కొత్త పాత్రలో చూస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ముందు తరాల వారి కోసం అవినీతి పరులైన రాజకీయ నేతలపై పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దేశాన్ని దుర్భర స్థితిలోకి నెట్టాయని జెఠ‍్మలానీ అన్నారు. 1993-98 మధ్య కాలంలో రామ్‌జెఠ్మలానీ వాదించిన హర్షద్ మెహతా,కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ స్కాం కేసులు సంచలనం సృష్టించాయి. అలాగే ఈ మధ్య కాలంలో కనిమొళి స్పెక్ట్రం 2 జి కేసు ను కూడా ఆయనే వాదించారు.