యుఎస్ లో అమరవీరులకు ఘననివాళ్ళు

SMTV Desk 2017-06-05 11:18:34  mahathmagandi, may 29 dallase, amerika mahathmagandi statues

హైదరాబాద్, జూన్ 5 : డల్లాస్ నగరంలోని అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి మన భారత పౌరులు ఘనంగా నివాళ్ళులర్పించారు... మే 29వ తేదిన అమెరికా దేశ రక్షణకోసం అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కారించుకొని దేశవ్యాప్తంగా అమరవీరులకు నివాళ్ళు అర్పించారు... ఈ సందర్భంగా ఇక్కడి మహాత్మాగాంధీ స్మారక కేంద్రం వద్ద పుష్పాంజలి ఘటించారు.. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త టెక్సాస్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లడుతూ, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముకశర్మ మహాత్మాగాంధీ శ్రద్ధాంజలి ఘటించటానికి విచ్చేయటం సంతోషకరమని పేర్కొన్నారు.. కార్యక్రమంలో షణ్మకశర్మ మాట్లాడుతూ, డల్లాస్ నగరంలో అన్ని జాతులు, మతాల ప్రాంతాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు వచ్చిన విశ్వశాంతికై పాటుబడిన మహనీయుడు బాపూజీ విగ్రహాన్ని ఇర్వింగ్ పట్టణంలో సుందరకరమైన ఉద్యానవనంలో ఏర్పాటు చేయటంలో ప్రధానపాత్ర వహించిన డాక్టర్ ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వల కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి పట్టినం, లక్ష్మీ గుంటూరి, శర్మ గుంటూరి, సాయి మందా, డాక్టర్ నరసింహారావు వేముల, ఎంవిఎల్ ప్రసాద్, కర్రా వెంకట్రావు, వెంకట్ ములుకుట్ల తదితరులు పాల్గొన్నారు.