ఘోర రోడ్డు ప్రమాదంలో 22 మంది దుర్మరణం

SMTV Desk 2017-06-05 10:25:14  up, bareli, accident, 22 members deth

బరేలి, జూన్ 5 : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బరేలీ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 22 మంది మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బరేలి సమీపంలో సోమవారం తెల్లవారుజామున బస్సు, ట్రక్కు పరస్పరం ఢీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థకు చెందిన బస్సు ఢీల్లి నుండి తూర్పు యూపి లోని గోండా జిల్లాకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. అయితే ఢీ కొట్టుకోవడంతోనే బస్సు డీజిల్ ట్యాంక్ పగలడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం హుటాహటిన అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేయడం ప్రారంభించారు. మంటలు బస్సులోకి వ్యాప్తి చెందడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. మంటల ద్వారానే ఎక్కువ మంది మృతి చెందారు. క్షతగాత్రులను బరేలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం పై విచారణ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు