విజయవంతమైన శతఘ్ని విధ్వంసక క్షిపణి నాగ్ పరీక్ష

SMTV Desk 2017-09-09 19:33:02  DRDO, Defense Research and Development Organization, Third generation Anti Tank Guided Missile, Indian Missiles

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారత్ సాంకేతికంగా ఎదుగుతుందనడానికి మరొక నిదర్శనం తాజాగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీవో) చేపట్టిన విధ్వంసక క్షిపణి ప్రయోగం. శుక్రవారం రాజ‌స్థాన్‌లోని ప‌శ్చిమ భాగాన ఉన్న ఎడారి ప్రాంతంలో శతఘ్ని విధ్వంసక క్షిపణి నాగ్ పరీక్షను డీఆర్‌డీవో నిర్వహించింది. కాగా ఈ పరీక్షను రెండుసార్లు చేపట్టగా, రెండు ల‌క్ష్యాల‌ను నాగ్ ఛేదించింద‌ని తెలిపింది. అయితే ఈ క్షిపణి పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసిన మూడో త‌రానికి చెందిన యాంటీ ట్యాంక్ గైడెడ్ ఆయుధంగా సంస్థ పేర్కొంది.