భారీ మొత్తంలో బీసీసీఐ చెల్లించిన జీఎస్టీ పన్ను

SMTV Desk 2017-09-09 19:24:24  GST, BCCI, CENTRAL GOVERNMENT, Team physicist Patrick Farhart

ముంబై, సెప్టెంబర్ 09 : దేశంలో వస్తు సేవ పన్నుకుగాను కేంద్ర ప్ర‌భుత్వం చేపట్టిన జీఎస్టీని అమ‌లులోకి తెచ్చిన తొలి నెలలో భారీగా పన్నులు రావ్వడం విశేషం. అదేలాగంటే.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డు బీసీసీఐ జులై నెలకు గానూ రూ.44,29,516ను జీఎస్టీ కింద పన్ను చెల్లించింది. అలాగే, టీమిండియా ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్‌కు కూడా ఐదు నెలల కాలానికి మొత్తం రూ.58, 87,139ను చెల్లించిన‌ట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక 2015-16 సీజన్‌ల్లో అంతర్జాతీయ మ్యాచుల నుంచి ఆర్జించిన గ్రాస్‌ రెవెన్యూలను కొంతమంది ప్లేయర్లకు ఇచ్చిన‌ట్లు తెలిపింది. అత్య‌ధికంగా స్టువర్ట్ బిన్నీకి రూ.92 లక్షలు చెల్లించినట్లు తెలిపింది, ఆ త‌రువాత‌ హర్బజన్‌ సింగ్‌కు రూ.62 లక్షలు, స్పిన్నర్‌ అక్సర్‌ పటేల్‌కు రూ.37.51 లక్షలు, ఉమేశ్‌ యాదవ్‌కు రూ.34.79 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.