ఉల్లి రైతులకు అండగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం

SMTV Desk 2017-09-09 19:20:32  Onion price drop, AP Minister, New Onion Price, AP Government

అమరావతి, సెప్టెంబర్ 9: ఉల్లి ధర పతనం కారణంగా ఆందోళన చెందుతున్న రైతులకు ఏపీ ప్రభుత్వం సాంత్వన కలిగించింది. ట‌న్ను ఉల్లిని రూ.6 వేల‌కు కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి ప్రకటించారు. దీని కోసం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించుతున్న‌ట్లు ఆయన పేర్కొన్నారు. గత వారం రోజుల క్రితం ధర బాగానే ఉందని, ప్రస్తుతం ట‌న్ను ఉల్లి ధ‌ర రూ.4 వేల‌కు ప‌డిపోయింద‌ని ఆయన తెలిపారు. కాగా, అందుకు కార‌ణం కొత్త పంట మార్కెట్లోకి రావ‌డ‌మేన‌ని మంత్రి స్పష్టం చేశారు.