ఆ సీటు ఖరీదు 75 వేలు

SMTV Desk 2017-06-04 18:52:00  train, reservation, fine ,vijaya kumar

న్యూఢిల్లీ, జూన్‌ 4 : నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైల్వే అధికారుల చేతి చమూరు వదిలించాడో వ్యక్తి..రిజర్వేషన్ లో తనకు కేటాయించిన సీటును తనకు ఇప్పించనందుకు రైల్వే శాఖకు విధించిన జరిమానా 75 వేల రూపాయల నష్టపరిహారాన్ని సొంతం చేసుకున్నాడు. న్యూ ఢిల్లీలో జరిగిన ఘటన వినియోగదారుల చైతన్యానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. 2013, మార్చి30న ఢిల్లీకి చెందిన విజయ్ కుమార్ విశాఖ పట్టణం నుంచి ఢిల్లీకి దక్షిణి ఎక్స్ ప్రెస్ లో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ ఆయన బుక్ చేసుకున్నసీటును వేరే వాళ్లు ఆక్రమించుకొని విజయ్ కుమార్ కు సీటు లేకుండా చేశారు. మోకాళ్ళ నొప్పితో బాధపడే విజయ్ కుమార్ కూర్చునేందుకు సరైన సీటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాంతో పాటు తన సీటు ఆక్రమించుకున్న వాళ్లు ఇబ్బంది పెట్టడంతో పాటు ఇతర ప్రయాణికులను సైతం విసిగించారు. వాళ్ల పై పిర్యాదు చేసేందుకు టీటీఈ కాని ఇతర రైల్వే అధికారులు ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసినా లాభం లేకుండా పోయింది. దాంతో ఢిల్లీ స్టేట్ కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ కుమార్ కు సీటు నిర్ధారించడంలో రైల్వే శాఖ అధికారులు విఫలమయ్యారని ధ్రువీకరించి..అందుకు పరిహారంగా ఎవరైతే కుమార్ కు టికెట్ బుక్ చేశారో వాళ్ళ జీతంలో నుండి 75 వేల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి.