మొబైల్ ఉంటే చాలు.. ఇక మాకు ఇంకేం వద్దంటున్న యువత.. కారణమిదేనా..?

SMTV Desk 2017-09-09 12:31:05  youth, youth mobile usage, Hyderabad youth,jio, mobile usage

హైదరాబాద్ సెప్టెంబర్ 9: ఇప్పుడు యువతకు ఎక్కడ చూసినా మొబైల్ చేతిలో పెట్టుకొని కనబడుతున్నారు. జియో వచ్చిన తర్వాత ఈ వినియోగం యువతలో మరింత పెరిగింది. యువత పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైంది అంటే..తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు కానీ..చేతిలో మొబైల్ మాత్రం తప్పనిసరి అంటున్నారు. అయితే ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఇంటర్నెట్ యూసేజ్ చార్జీలు తగ్గడం తో పాటు.. యువతలో ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన పెరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఈ మార్పు దేశాభివృద్ధికి తోడ్పడుతుందా..? అంటే లేదనే సమాధానమే విస్పష్టం. ఎందుకంటే..ఇంటర్నెట్ ను వినియోగిస్తున్న యువత అంతా కూడా కేవలం చాటింగ్ కు, ఇంకా అనవసర కార్యాలకు మాత్రమే నెట్ ను వాడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంటర్నెట్ ను సరైన క్రమంలో విజ్ఞానాన్ని పెంచుకునే విధానంలో వాడితే అది మన దేశ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని విద్యా వేత్తలు అభిప్రాయపడుతున్నారు.