పాకిసస్థాన్, మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ కు ఎదురైన కష్టాలు!

SMTV Desk 2017-09-09 11:08:27  Former Pakistan Prime Minister Nawaz Sharif, Supreme Court,

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 09: పనామా పత్రాల వ్యవహారంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. నవాజ్ ఆయన కుటుంబ సభ్యులపై నలుగు కేసులు నమోదు చేసిన జాతీయ జవాబుదారి సంస్థ అక్రమ ఆదాయాలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించి కేసులు ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రధాని పదవిని కోల్పోయిన నవాజ్‌ షరీఫ్‌.. అసలు విషయంలోకి వెళితే... అక్రమ ఆస్తులకు సంబంధించి పనామా పేపర్ లా వ్యవహారంలో పదవి నుంచి ఉద్వాసన గురైన నవాజ్‌ షరీఫ్‌కు కష్టాలు వెంటాడుతున్నాయి. వాజ్‌ సహా అతని ఇద్దరు కుమారులు, కుమార్తె, అల్లుడు, ఆదేశ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌పై పాక్‌ జాతీయ జవాబుదారీ సంస్థ నాలుగు కేసులు నమోదు చేసింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా జాతీయ జవాబుదారీ సంస్థ నివేదికల ఆధారంగా ఈ కేసులు నమోదయ్యాయి. అక్రమ ఆదాయాలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించి వీరందరిపై వేర్వేరుగా కేసులు చేశారు. అక్రమ ఆస్తులకు సంబంధించి పనామా పత్రాల్లో వెలువడిన సమాచారం దేశ సుప్రీంకోర్టు ఆధారంగా ప్రధాన మంత్రిగా నవాజ్‌ను జూలైలో అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.