జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్

SMTV Desk 2017-06-04 18:22:32  ghmc, bumper offer, tax payers, commisioner janardhanreddy

హైదరాబాద్, జూన్‌ 4 : జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ రుసుము చెల్లించిన వారికి నగదు బహుమతులు అందించాలని నిర్ణయించింది. ఈ నెలలో పన్నులు చెల్లించే వారికి లక్ష మెగా బహుమతితో పాటు, 119 నగదు బహుమతులు అందజేస్తామని కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డి వివరించారు. ప్రస్తుత సంవత్సరం ఆస్తిపన్నుతో పాటు, బకాయిలు చెల్లించే వారికి ఈనెల 30న డ్రా తీసి నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ పౌర సేవా కేంద్రాలు, మీ సేవా, ఈ సేవా కేంద్రాలు, ఆన్ లైన్ లో చెల్లించిన వారికి ఈ బహుమతులు అందిస్తారు. బంపర్ బహుమతి లక్ష రూపాయలు, మెుదటి బహుమతి 50 వేలు, ద్వితీయ బహుమతి 25 వేల చొప్పున ఇద్దరికి, తృతీయ బహుమతి పదివేల చొప్పున ఐదుగురికి, నాలుగో బహుమతి 5 వేల చొప్పున పది మందికి, కన్సొలేషన్ బహుమతులు 2వేల చొప్పున 75 మందికి అందించనున్నారు. అదే విధంగా ఆన్ లైన్ లో చెల్లించే వారికి ట్రాన్సాక్షన్ చార్జీలు మినహాయింపు అమలులో ఉంది.