పవన్ కళ్యాణ్ గురించి ఎన్టీఆర్ మాటల్లో

SMTV Desk 2017-09-08 22:34:01  jr ntr, mahesh katti, pawan kalyan, pawan fans, gauri lankesh

హైదరాబాద్ సెప్టెంబర్ 9: తాజాగా మహేష్ కత్తి పవన్ పై చేసిన ఆరోపణల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, తనని చంపేస్తామంటూ బెదిరింపు వస్తున్నాయంటూ ఆయన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఈయన చేసిన కామెంట్లపై పవన్ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ విధంగా మహేష్ కత్తి చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎంతో మనసున్న వ్యక్తి అని ఎన్టీఆర్ అన్నాడట. ఇదే సమయంలో కత్తి మహేశ్ గురించి తారక్ ప్రస్తావించారట. అంత పెద్ద స్టార్ గురించి ఇలాంటి వ్యాఖ్యానాలు కత్తి మహేశ్ చేయకుండా ఉంటే బాగుండేదని తన సన్నిహిత వర్గాల దగ్గర ఆయన అన్నారట. బెంగళూరుకు చెందిన సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లలో.. ‘గౌరీ లంకేశ్’ కు బదులు ‘గౌరీ శంకర్’ అనే పేరు రాయడంపైనా మళ్ళీ కత్తి మహేశ్ విమర్శలు గుప్పించారు.