యాక్షన్ తరహా లో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల చిత్రం

SMTV Desk 2017-09-08 21:12:55  NTR, jr ntr, trivikram, ntr next movie, action entertainer

హైదరాబాద్ సెప్టెంబర్ 8 : జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ తరువాత చిత్రం త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు, అయితే ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందట. త్రివిక్రమ్ ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు తీస్తుంటారు, కానీ తన పంథా మార్చి ఆక్షన్ తరహా లో తీస్తున్నాడని తెలియడం తో అభిమానులంతా ఈ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తారని సమాచారం. అయితే ఈ చిత్రం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చిత్రం పూర్తి కాగానే మొదలవుతుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోబోతున్నారని సమాచారం. థాయ్ లాండ్ .. ఇండోనేషియా స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ను తెరపై చూపించనున్నట్టు సమాచారం. ఈ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడానికి ఎన్టీఆర్ ఆగ్నేయ ఆసియా వెళ్లనున్నట్టు సమాచారం. కాగా పవన్ కళ్యాణ్ 25వ చిత్రానికి పనిచేసిన తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవీంద్రన్ ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారని టాక్.