మెక్సికోలోని 8 దేశాలకు సునామీ హెచ్చరికలు

SMTV Desk 2017-09-08 17:58:31  South Mexico, Massive earthquake, American Ground Center, Tsunami, Mexico, Guatemala, El Salvador, Costa Rica, Nicaragua, Panama, Honduras, Ecuador

మెక్సికో, సెప్టెంబర్ 08 : దక్షిణ మెక్సికోలో తీరంలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనకు ఇప్పటివరకు ఇద్దరు చనిపోయినట్లు సమాచారం. భూకంప లేకినిపై తీవ్రత 8 గా నమోదైనట్లు అమెరికా భూవిజ్ఞాన కేంద్రం ప్రకటించింది. దీని కారణంగా పశ్చిమ మెక్సికో తీరంలోని 8 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. మెక్సికో, గ్వాటెమాలా, ఎల్‌ సాల్వడార్‌, కోస్టారికా, నిఖరాగ్వా, పనామా, హోండూరస్‌, ఈక్వెడార్‌ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర గర్భంలో 35 కిలోమీటర్ లోతున భూకంప కేంద్రం నమోదైనట్లు తెలుస్తుంది. సునామీ కారణంగా మెక్సికో తీరంలో 10 అడుగుల మేర అలలు ఎగసి పాడుతాయని హెచ్చరికలు జారీ అవ్వడంతో, మిగతా దేశాలకు మాత్రం కాస్త తక్కువ ఎత్తులో అలలు తాకే అవకాశం ఉందని తెలిపారు. ఈ భూకంప ధాటికి మెక్సికో రాజధాని సిటీలోను భూమి కంపించింది. భవనాలు ఉగడంతో అవి కూలుతాయన్న భయంతో అక్కడి ప్రజలు భయపడుతూ పరుగులు తీశారు.