దేశానికే ఆదర్శంగా భాగ్యనగరం అడుగులు: బొంతు రామ్మోహన్

SMTV Desk 2017-09-08 14:59:58  hyderabad, ghmc mayor bonthu rammohan, telagana

హైదరాబాద్, సెప్టెంబర్ 8: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ సర్వసభ్యసమావేశంలో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..." వచ్చే మూడు నెలల్లో నగరమంతా ఎల్ఈడీ బల్బులతో విద్యుత్ కాంతులు వెదజల్లుతాయని, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వాటి ఏర్పాట్లు పూర్తి అయితే దేశంలోనే ఆదర్శ నగరంగా నిలుస్తుందని అన్నారు. 144 వార్డుల్లో ఏరియా సభల ప్రతినిథుల ఎంపిక ఆమోదంతో సహా గతంలో జరిగిన స్టాండింగ్ కమిటీ లో ఆమోదించిన 35 అంశాలు 11 టేబుల్ ఎజెండా అంశాలకు ఆమోదం" తెలిపారు. ఈ సభలో కమీషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లడుతూ..."జంట నగారాల్లో కుక్కల బెడదను తగ్గిస్తామని, పనులు తాత్సారం చేసే గుత్తాదారులకు తాఖీదులిస్తామని" అయన అన్నారు. అదేవిధంగా ఆహార కల్తిని నిరోదించటానికి ఈ చలానా ను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నిర్వహించిన తనఖీల్లో 333 అనధికార హోర్డింగ్లు ఉన్నట్లు తేలిందని పలువురు కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకొచ్చారు.