అసెంబ్లీ సీట్ల పెంపు పై ఇక ఆశలు వదులుకోండి: భన్వర్ లాల్...!

SMTV Desk 2017-09-08 14:37:23  bhanvarlal, kcr, chandrababu, ap politics, telangana politics

హైదరాబాద్ సెప్టెంబర్ 8: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ సీట్లను ఎప్పుడు పెంచుతుందా..ఎపుడు అత్యధిక స్థానాలని గెలుచుకునే అవకాశం దక్కుతుందా..అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న తరుణంలో ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ వీరి ఆశలపై నీళ్లు జల్లారు. 2002 సంవత్సరంలో చేసిన రాజ్యాంగ సవరణలో 2026 వరకు అసెంబ్లీ సీట్లను పెంచవద్దని స్పష్టంగా ఉందని అన్నారు. అయితే అసెంబ్లీ సీట్లను పెంచితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయం పై ఇరు రాష్ట్రాల సీఎం లు ప్రణాళికలను తయారు చేసి పెట్టికున్న తరుణంలో భన్వర్ లాల్ వ్యాఖ్యలతో కొత్త స్థానాల్లో పోటీ చేయాలని కలలు కన్నవారి ఆశలు అడియాశలు అయ్యాయనే చెప్పవచ్చు. అయితే తెలంగాణ లో శాసన సభ స్థానాలకు పోటీ పడే వ్యక్తులు ఉన్న స్థానాలకంటే ఎక్కువగా ఉన్న తరుణంలో ఈ పెంపు తో వారికి ఆ స్థానాల్లో సర్ధుబాటు చేయాలని అనుకున్న ప్లాన్ అంతా వెస్ట్ అయింది. అలాగే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్ పై అత్యధిక స్థానాల్లో గెలుపొందడానికి ఇది మంచి అవకాశంగా భావించిన చంద్రబాబు ఆశలు కూడా గల్లంతయ్యాయి.