సంచలన ట్వీట్ చేసిన దిగ్విజయ్ సింగ్...

SMTV Desk 2017-09-08 14:21:54  Madhya Pradesh Chief Minister and Congress leader Digvijay Singh, Twitter, Diggiraja

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 08 : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ట్విట్టర్‌ లో చేసిన సంచలన ట్వీట్లు పై వివాదాస్పదం కావడంతో కొన్నాళ్లు మౌనంగా ఉండడం తరువాత మళ్లీ అదే స్థాయిలో ట్వీట్ చేయడం ఆయనకు ఓ అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా డిగ్గీరాజా చేసిన ట్వీట్ మరోసారి ట్విట్టర్ లో పెను కలకలం రేగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో కూడిన రెండు లైన్ల అసభ్య పదజాలంతో ఉన్న ఆ ట్వీట్ ను ఉదహరిస్తూ... ఇలాంటి రాతలకు విచారిస్తున్నానంటూ పేర్కొన్నారు. దీనిపై ట్వీట్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.