పునేరీకి గట్టి పోటీ ఇచ్చిన తెలుగు టైటాన్స్

SMTV Desk 2017-09-08 13:05:01  pro kabaddi -telugu taitans, pro kabaddi updates

కలకత్తా సెప్టెంబర్ 08: ప్రో కబడ్డీ పోటీల్లో తెలుగు అభిమానులు ఒకింత నిరాశ పడినప్పటకి ప్రొ కబడ్డీ లీగ్‌లో గురువారం తెలుగు టైటాన్స్‌ 42-37తో పుణెరి పల్టాన్‌ చేతిలో పోరాడి ఓడింది. తొలి అర్ధభాగంలో ఒక దశలో 0-18తో వెనకబడిన టైటాన్స్‌.. ఆ తర్వాత గొప్పగా పుంజుకుంది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా టైటాన్స్‌ 36-40తో ప్రత్యర్థికి సమీపంగా వచ్చేసింది. అయితే మరో నిమిషంలో మ్యాచ్‌ పూర్తవుతుందనగా.. రాహుల్‌ చౌదరిని డిఫెండర్‌ గిరీష్‌ సూపర్‌ ట్యాకిల్‌ చేసి స్కోరు 42కు పెంచడంతో పుణె విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు టైటాన్ కెప్టెన్ రాహుల్ చౌదరి గత సీజన్లో అద్భుత ప్రతిభ కనపరిచినప్పటికి ఈ సారి కాస్త వెనుకబడి నట్లు గా కనిపిస్తోంది ఐనప్పటికీ నిన్నటి మ్యాచ్ లో సెకండ్ హాఫ్ లో రాహుల్ విజ్రంభించి ఆడాడు. అయితే కెప్టెన్ గా టీం ను నడిపించటం లో తడపడుతున్నట్ట్లుగా కనిపిస్తోంది. మరో పక్క తెలుగు టీం లో డిఫెన్సు లోపాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా రాహుల్ కు చేదోడు వాదోడు గా ఉండే రైడర్ నీలేష్ సాలున్కే మ్యాచ్ లో లేక పోవడం మరొక లోటు గా కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు టైటాన్ 13 మ్యాచ్ లు ఆడి 9 మ్యాచ్ ల్లో పరాజయం పొందింది. మరో 3 మ్యాచ్ లు గెలిచింది. ఒక మ్యాచ్ టై గా ముగిసి స్కోర్ బోర్డు లో 4 స్తానం లో ఉంది. ఇప్పటి వరకు జరిగిన ప్రో కబడ్డీ మ్యాచ్ లు పరిశీలిస్తే గుజరాత్, హర్యానా స్టీలర్స్, యు ముంబా,,జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు బలంగా కన పడుతున్నాయి. అయితే పునేరి పల్టన్, దాబాంగ్ ఢిల్లీ, పట్నాఫైiరేట్స్ జట్లను తక్కువగా అంచనా వేయలేం. ఇక తెలుగు టైటాన్ రాబోయే ప్రతి మ్యాచ్ లో గెలవడం లేదా టై చేయడం జరిగితే ఫైనల్స్ అవకాశాలు మెరుగు పడతాయి. ఈ రోజు ప్రో కబడ్డి పోటీల్లో గుజరాత్ ఫార్చున్-యు పీ యోధ, హర్యానా-పాట్నా జట్లు తలపడ నున్నాయి.