డేరా బాబా డేరా లో అస్థిపంజరాలు..ఎలా వచ్చాయి..? ఏంటా మిస్టరీ..?

SMTV Desk 2017-09-08 11:47:30  dera baba, dera baba national news, dera baba top news today, dera baba breaking news, dera baba crime news

చండీగఢ్‌ సెప్టెంబర్ 8: బాబా ముసుగులో ఉండి ఇన్నాళ్లు భోగ భాగ్యాలు అనుభవించిన డేరా బాబాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇతను అన్యాయాలు, అక్రమాలపై కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఇందులో భాగంగా పోలీసులు డేరా బాబా నిలయంలో శునకాలతో జరిపించిన సోదాలో పదుల సంఖ్యలో అస్థి పంజరాలు బయటపడ్డాయి. అయితే వీటిని వెలికి తీసిన పోలీసులు అస్థి పంజరాలు ఎవరివి..? ఎక్కడి నుండి వచ్చాయి..? నది ఆలయంలో అస్థి పంజరాలను పూడ్చడం వెనక కారణాలేంటివి..? అయితే దీనికి బాబా ఆలయ సంస్థానం వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే.. చాలా మంది తమ మరణం తర్వాత బాబా ఆలయ సన్నిధిలో పుడ్చాలని కోరుకున్నారని, వారి కోరిక నేరవేర్చడానికే వారిని ఇక్కడ పుడ్చామని వారు పోలీసులకు తెలిపారు. అయితే వీరు చెబుతున్న ఈ కారణం వాస్తవమా..? అంటే కాదనే అంటున్నారు సామాజిక విశ్లేషకులు. డేరా బాబా చాలా మంది మహిళలను కామ వాంచ తీర్చడానికి తన ఆలయంలోకి పిలుపించుకుని వారిపై అత్యాచారం చేసే సమయంలో వారు ప్రతిఘటించినందుకే వారిని హత్య చేశారని, ఈ తతంగాన్ని బయట పెడదామని వెళ్లిన వారిని కూడా బాబా ఆలయంలోకి పిలిపించుకొని వారిని హత్య చేశారని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే పోలీసుల విచారణ కూడా ఇదే కోణంలో సాగుతుంది. అయితే పోలీసుల విచారణ కంటే ముందే మీడియా ఆ అస్థిపంజరాలన్నీ బాబా చేసిన హత్యలు అంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే బాబా చేసిన నేరాలన్నీ కోర్టులో రుజువైతే మాత్రం బాబాకు ఉరి శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.