ట్విట్ట‌ర్‌లో ట్రెండ్‌గా మారిన `#బ్లాక్‌న‌రేంద్ర‌మోదీ`

SMTV Desk 2017-09-07 18:21:43  Indian Prime Minister Narendra Modi, Twitter, Journalist Goue Langesh

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 07 : భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్వీట్టర్ లో అనుసరిస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన్ని బ్లాక్ చేస్తున్నారట.. అసలు విషయంలోకి వెళితే, దీనంత‌టికీ కార‌ణం జ‌ర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హ‌త్య‌గా తెలుస్తోంది. ఆమె హ‌త్య‌కు గురైన త‌ర్వాత నిఖిల్ ద‌ధీచీ అనే వ్య‌క్తి ఆమెకు త‌గిన శాస్తి జ‌రిగింద‌ని, దీంతో మిగ‌తా కుక్క‌లు కూడా నోరుమూసుకుంటాయ‌ని బూతులు ఉప‌యోగిస్తూ ట్వీట్ పెట్టాడు. ఈ వ్య‌క్తిని అనుస‌రిస్తున్న వారి జాబితాలో చాలా మంది రాజకీయనేత‌ల‌తో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని క‌నిపెట్టిన‌ సామాజిక వాది డా. రాకేశ్ పారిఖ్, పాత్రికేయుల హ‌త్య‌కు న‌రేంద్ర‌మోదీ మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాడ‌ని, నిఖిల్ ద‌ధీచీ అకౌంట్‌ను ప్ర‌ధాని అన్‌ఫాలో చేసే వ‌ర‌కు ప్ర‌ధాని అకౌంట్‌ను ఎవ్వ‌రూ అనుస‌రించ‌వ‌ద్ద‌ని ప్రచారం మొద‌లుపెట్టాడు. దీంతో పాటే `#బ్లాక్‌న‌రేంద్ర‌మోదీ`ని ఉప‌యోగించడం జరిగింది.