మయన్మార్ నుంచి స్వదేశానికి బయలుదేరిన మోదీ

SMTV Desk 2017-09-07 16:56:20  Myanmar, india, narendra modi

మయాన్మార్ సెప్టెంబర్ 7 : మయాన్మార్ లో తొలి ద్వైపాక్షిక పర్యటన సహా మూడు రోజుల విదేశీ పర్యటనను ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశం బయలుదేరారు. భారత్-మయన్మార్ బంధం బలోపేతం చేయడం సహా ద్వైపాక్షిక సహాకారం పెంపొందించేలా తమ పర్యటన సాగిందని స్వదేశానికి బయల్దేరేముందు మోదీ ట్వీటర్ లో వ్యాఖ్యానించారు. విమానాశ్రయంలో మయన్మార్ నేతలు, అధికారులు ప్రధానికి వీడ్కోలు పలికారు. భారత్ బయలుదేరే ముందు మోదీ యాంగన్‌లోని కాలీబరీ ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతకుముందు చిట్టచివరి మొగల్ చక్రవర్తి బహదూర్‌ షా సమాధిని సందర్శించి నివాళ్ళర్పించారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మోదీ చైనాలో బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు సహా పలువురు ఇతర నేతలతోనూ భేటీ అయ్యారు.