కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పతో పాటు పలు నేతల అరెస్ట్

SMTV Desk 2017-09-07 14:20:25  Former CM BS Yeddyurappa, The Congress party is political murders, bjp, police

బెంగుళూరు, సెప్టెంబర్ 07 : కర్ణాటక కన్నడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ హత్యలు పాల్పడుతుందని ఆరోపిస్తూ, బీజేపీ మెగా ర్యాలీని నిర్వహిస్తుండగా, నిబంధనలకు విరుద్ధంగా నిరసనలు చేపట్టారని పోలీసులు మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తదితరులను అరెస్ట్ చేశారు. నిరసనకి అనుమతిని ఇచ్చిన రక్షణ శాఖ యడ్యూరప్ప, ఇతర బీజేపీ నేతలు పాల్గొనేందుకు మాత్రం అంగీకరించలేదు. అనుమతి లేకున్నా వారు వస్తున్నారన్న విషయం తెలుసుకుని పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇక నేతలు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు నగరంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా, వారిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గడచిన రెండు సంవత్సరాల వ్యవధిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పార్టీలకు చెందిన 12 మందిని దారుణంగా హత్య చేశారని బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.