ఆధునిక యుగంలోనూ ఆనాగరిక శిక్షలు...

SMTV Desk 2017-09-07 11:20:09  prakasam, andhrapradesh,

ప్రకాశం, సెప్టెంబర్ 7: అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో పెద్దమనుషులదే పెత్తనం, అన్యాయం చేసిన వ్యక్తినే కాదు ఫిర్యాదు చేసిన వ్యక్తిని సైతం దండిస్తారు. దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అనుకుంటున్నాము, కానీ ఇంకా పల్లెల్లో మాత్రం ఆగని అనాగరిక పెదరాయుళ్ళ తీర్పు కొనసాగుతుంది. కట్టుబాట్ల పేరుతో కఠిన శిక్షలు విధిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి కాలనీలో చోరి నెపంతో మండుతున్న గడ్డపారను పట్టుకోవాలని ఊరు పెద్దలు జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ శిక్ష లో చేతులకు గాయాలైన వాళ్ళు తప్పు చేసినట్లుగా నిర్దారణ చేస్తారు. ఇష్టానుసారంగా విధించిన శిక్షలపై...చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి, పెద్దల అనాగరిక తీర్పు పై హేతువాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.