గోమాత పై జరిగే దాడులకు సుప్రీంకోర్టు కేంద్రానికి సూచన

SMTV Desk 2017-09-06 18:01:19  Reference to the Supreme Court Center, Senior defense officer, Nodal officer

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 06 : గోమాతను అడ్డుకొనే పేరుతో జరిగే దాడులను ప్రతి జిల్లాకి ఒక్కరి చొప్పున సీనియర్ రక్షణ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. గోమాతను అడ్డుకొనే పేరుతో జరుగుతున్న దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాఖ్యను విచారించిన సుప్రీంకోర్టు తీసుకుంటున్ననివారణ చర్యలపై నివేదిక సమర్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. శాంతి భద్రతల పరిరక్షణపై రాష్ట్రాలకు రాజ్యాంగంలోని 256 నిబంధనల కింద ఆదేశాలు ఇవ్వవచ్చన్న అంశంపై స్పందనను తెలపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.