జరిగిన విషయం గురించి విచారించి నిర్ణయం తీసుకోండి చంద్రబాబు: వంగవీటి

SMTV Desk 2017-09-06 17:27:20  vijayawada, andhrapradesh, vangaveeti radhakrishna, goutham reddy,

విజయవాడ, సెప్టెంబర్ 6: గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై వంగ వీటి రాధక్రిష్ణ మీడియా తో మాట్లాడుతూ..."చంద్రబాబునాయుడు గారు జరిగిన విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే జరిగిన ఘటనపై విచారణ జరిపించాలి. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ బాధపడింది కనుకే అతన్ని సస్పెండ్ చేశారు. ఒక మహిళా మాజీ ఎమ్మెల్యే ను అవమానించారు. మమ్మల్ని అవమానించిన వారి అధికారుల పై చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతలు చంద్రబాబునాయుడి కంట్రోల్ లో లేవంటూ" అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.