ఎక్కువ మంది పిల్లల్ని కనండి..లేకపోతే రోబోలను వాడాల్సి వస్తుంది: చంద్రబాబు

SMTV Desk 2017-09-06 17:11:38  chandhrabaabu, 2019 elections, ap elections, ap politics, tdp elections babu

అమరావతి సెప్టెంబర్ 6: ఒకప్పుడు జనాభా విపరీతంగా పెరిగిపోతుందని, జనాభాను తగ్గించుకోవాలని, ప్రతి ఒక్కరు కేవలం ఒకరిని మాత్రమే కనాలని పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడేమో మళ్ళీ రూటు మార్చారు. జనానాల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని, పోషణ భారంతో పిల్లల్ని కనడానికే దంపతులు భయపడిపోతున్నారని, ఈ తంతు ఇలానే కొనసాగితే మన దేశం కూడా జపాన్ లో అవసరానికి రోబోలను వాడాల్సి వస్తుందని అన్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ ను బాగా ప్రచారం చేసిన నేనే పిల్లల్ని కనమని చెబుతున్నాను. మన తల్లి దండ్రులు కూడా మనలాగే ఆలోచిస్తే మనం కూడా పుట్టేవాళ్ళం కాదని హిత బోధ చేశారు.