నాలో కూడా లోపాలున్నాయి.. సరిదిద్దుకుంటా: లోకేష్

SMTV Desk 2017-09-06 16:10:07  lokesh,nara lokesh, tedi leader lokesh, ap politics, political news, ap politics

అమరావతి సెప్టెంబర్ 6: తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలే లక్ష్యంగా నాయకులను, కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ శిక్షణలో మంత్రులతో పాటు అందరు నాయకులకు వ్యక్తిత్వ వికాస, రాజకీయ అవగాహన పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే ఇందులో వచ్చిన ఫలితాలను పరీక్షించిన లోకేష్ ఇంకా రాజకీయ పరంగా తనలో కూడా లోపాలు ఉన్నాయని.. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పరీక్షల వల్ల నాయకుల ఆలోచనా విధానం ఏ విధంగా ఉంది, ఇంకా వారిలో ఎలాంటి మార్పులు రావాలి అనే విషయాలను తెలుసుకోవచ్చని చెప్పారు. అయితే ఈ కార్యక్రమం జిల్లాల స్థాయిలో సక్సెస్ అయితే గ్రామ స్థాయి నాయకులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని లోకేష్ తెలిపారు.